వెండితెరపై చరిత్ర : కేసీఆర్ సినిమా పేరు ఉద్యమ సింహం

KCR-FBసినీతారల బయోపిక్ సినిమాలు సక్సెస్ కావడంతో ..రాజకీయ నాయకులు బయోపిక్ పై కన్నేశారు డైరెక్టర్లు. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ ఫిక్స్ చేశారు. గురువారం (జూన్-28) కేసీఆర్ బయోపిక్ సినిమాను లాంచనంగా ప్రారంభించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కేసీఆర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు నాజర్‌ నటిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు డైరెక్టర్. ఈ క్రేజీ మూవీకి ఉద్యమ సింహం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్‌ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates