వెజిట్రబుల్స్ : మండిపోతున్న కూరగాయల ధరలు

vegiసిటీలోని మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సమ్మర్ కి ముందు కేవలం కిలో 5 రూపాయల ధర పలికిన టమాట ప్రస్తుత ధర రూ. 22 గా ఉంది. ఇక మిరప ధర రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం కిలో 50 రూపాయలకు చేరుకుంది. ఇక బీన్స్ ధర అయితే మండిపోతుంది. కిలో బీన్స్ ధర రూ.80 గా ఉంది. క్యారెట్ రూ.30, క్యాప్సికమ్ రూ.45 గా ఉన్నాయి. అయితే బుతుపవనాల రాక ఆలస్యంతో ప్రతి ఏటా జూన్ మధ్యలో కూరగాయల ధరలు స్ధిరంగా ఉండేవవని, అయితే సిటీ మార్కెట్లలో ఈ సారి మాత్రం ఎటువంటి తగ్గుదల లేదని వినియోగదారులు చెబుతున్నారు. అయితే సమ్మర్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సీజనల్ వెజిటేబుల్స్ ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని, దీంతో పెద్ద స్ధాయిలో సిటీ మార్కెట్లకు సఫ్లైయి తగ్గిపోయిందని వ్యాపారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates