వెదర్ అలర్ట్ : ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు

rainరాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రమంతా రుతువపనాలు విస్తరించాయి. 4న రాయలసీమ, కోస్తాంధ్రను తాకిన నైరుతి రుతుపవనాలు… శుక్రవారం(జూన్-8) తెలంగాణలో ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. నైరుతి ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు బాగానే పడుతాయని.. జూన్ 15 నుంచి కాస్తా తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రలు రికార్డ్ అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates