వెదర్ అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు

రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం… ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో బుధ, గురువారాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం (జూలై-13) ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపించాయి. ఇందులో భాగంగానే రానున్న మూడురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణాల్లో  అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates