వెదర్ చేంజ్.. హైదరాబాద్ లో వర్షం

rainహైదరాబాద్ లో ఆదివారం (ఏప్రిల్-1) పలుచోట్ల ఆకస్మికంగా వర్షం పలుకరించింది. నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వర్షం పడగా.. సికింద్రాబాద్‌, మౌలాలీలో వడగండ్ల వాన ముంచెత్తింది. మల్కాజ్‌గిరి, సైనిక్‌పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉప్పల్‌, నాగోల్‌, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌లో వర్షం పడింది. ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, హిమయత్‌నగర్‌, రాంనగర్‌, విద్యానగర్‌ ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

Posted in Uncategorized

Latest Updates