వెదర్ రిపోర్ట్ : మరో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ పరిసరాల్లో 2 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర కోస్తా ఒడిశా పరిసరాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపింది భారత వాతావరణ శాఖ. దీనికితోడు ఉత్తర బంగాళాఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ , కుమ్రంభీం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నిర్మల్ , మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్  భూపాలపల్లి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోనూ రాబోయే 48 గంటల్లో వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతాయని.. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates