వెధర్ చేంజ్ ఎఫెక్ట్ : ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్స్

v6వాతావరణ మార్పులు జనాన్ని భయపెడుతున్నాయి. వేసవిలో ఇప్పటికే వడదెబ్బ , డయేరియా, కుక్కకాటు కేసులు తీవ్రంగా ఉండగా… కొన్నిరోజులుగా వర్షం కూడా తోడవడంతో వివిధ రకాల జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రయివేట్ అనే తేడా లేకుండా ఆస్పత్రులకు పేషెంట్లు బారులు తీరుతున్నారు.
రాష్ట్రంలో ఒక పక్క ఎండ, మరో పక్క వర్షం దంచికొడ్తుండటంతో జనం భయపడుతున్నారు. ఇప్పటికే వేసవికాలంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో మరికొన్ని జబ్బులు వస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు సీజనల్ ఫివర్స్ తో పాటు దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు.
రెండునెలలుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో వడ దెబ్బ, డయేరియా, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలతో చాలామంది గాంధీ, ఉస్మానియాతో పాటు నల్లకుంటలోని ఫివర్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఇవి కొనసాగుతుండగానే కొన్నిరోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తుండటంతో డిప్తీరియా, మలేరియా, మమ్స్ లాంటి జబ్బులు వస్తున్నాయి. వేసవిలో కుక్క కాటు కేసులు కూడా పెరుగుతున్నాయి. బయట ఆహార పదార్థాలను తినకుండా, చేతులు నీట్ గా కడుక్కోవడం, శుభ్రమైన వాటర్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చంటున్నారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates