వెనక్కి తగ్గిన ‘మా’: శ్రీరెడ్డిపై బ్యాన్ ఎత్తివేత-క్యాష్ క‌మిటీ ఏర్పాటు

sriన‌టి శ్రీ‌రెడ్డిపై విధించిన నిషేదాన్ని ఎత్తి వేసింది మూవీ ఆర్టిస్ట్‌ అసోసి యేషన్‌ (MAA). అంతేకాదు మ‌హిళా న‌టులు తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను చెప్పుకునేందుకు వీలుగా క్యాష్ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్ లో ఫిల్మ్ ఛాంబ‌ర్ లో మీడియా స‌మావేశంలో జెమినీ కిర‌ణ్, మా అధ్య‌క్షుడు శివాజీ రాజా, న‌రేష్ లు ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై మాట్లాడారు. శ్రీ‌రెడ్డి అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేయడంతో ఎమోష‌న‌ల్ గా ఫీలై మాత్ర‌మే ఆమెపై నిషేధం నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ఇక నుంచి శ్రీ‌రెడ్డి ఏ మూవీలోనైనా, ఎవ‌రితోనైనా న‌టించ‌వ‌చ్చ‌ని, ఆమె కూడా మా కుటుంబంలో స‌భ్యురాల‌ని తెలిపారు. శ్రీ‌రెడ్డి మా స‌భ్య‌త్వం విష‌యంలో త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

సినీ పరిశ్రమలో మా ఇవ్వదని.. దర్శక నిర్మాతలే ఇస్తారన్నారు మా అధ్యక్షుడు శివాజీ రాజా. మా కోరిక ప్రకారం తెలుగువారికి అవకాశాలు ఇవ్వాలని దర్శక నిర్మాతలను కోరుతున్నామన్నారు. శ్రీరెడ్డిపై ఎలాంటి బ్యాన్ లేదన్న శివాజీరాజా..నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన యువతులపై ప్రొడ్యూసర్ల నుంచి.. సినిమా టెక్నీషన్ల వరకు లైంగిక దాడులు చేస్తున్నారంటూ ఇటీవల కాలంలో నటి శ్రీరెడ్డి పలు ఇంటర్వ్యూలలో మీడియా సాక్షిగా సంచలన విషయాలు తెలిపింది. ఆ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలేనని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసి యేషన్‌  శ్రీరెడ్డితో ఎవరూ నటించకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మా అసోసియేషన్‌ తీసుకున్న బ్యాన్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టింది. అంతేకాకుండా తనతో రాసలీలలు జరిపారంటూ కొన్ని ఫోటోలను బయటపెట్టింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా మా అసోసియేషన్‌ శ్రీరెడ్డిపై విధించిన బ్యాన్‌ నిర్ణయాన్ని ఎత్తివేసింది.

Posted in Uncategorized

Latest Updates