వెనుకంజలో జానా, రేవంత్

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కొడంగల్‌లో రేవంత్‌పై టీఆర్ ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నరేందర్‌రెడ్డిపై రేవంత్‌ 651 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మరోవైపు అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌పై కిషన్‌రెడ్డి 523 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates