వెబ్‌సైట్‌లో గురుకుల పోస్టుల హాల్ టికెట్లు

తెలంగాణలోని గురుకులాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్( PGT),ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డు (TREIRB) శనివారం(సెప్టెంబరు-22)న హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను పొందవచ్చని TREIRB తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,932 పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 1,972 PGT పోస్టులు, 960 TGT పోస్టులు ఉన్నాయి. సెప్టెంబరు 28 నుంచి పీజీటీ పరీక్షలు, అక్టోబరు 11 నుంచి టీజీటీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates