వెయ్యి కోట్లతో పాతబస్తీలో మౌలిక సదుపాయాలు : కేసీఆర్

KCRహైదరాబాద్ పాతబస్తీలో వెయ్యి కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, కొద్ది రోజుల్లో తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తామన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. పాతబస్తీని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు . రంజాన్ నెల ప్రారంభానికి ముందే పాత బస్తీలో పర్యటించి ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రకటిస్తానని, అప్పటి వరకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates