వెయ్యి కోట్ల విలువైన NPA లు : అమ్మకానికి పెట్టిన SBI,PNB

పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ దిగ్గజాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI),పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) తమ దగ్గర ఉన్న నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) లను అమ్మకానికి పెట్టింది. మొండి బకాయిలతో సతమవుతున్న బ్యాంకులు తమ దగ్గర ఉన్నNPAలను  వేలానికి వేయాలని నిర్ణయించాయి. రూ.1,063 కోట్ల విలువైన 15 NPA లను ఈ రెండు బ్యాంకులు అమ్మకానికి పెట్టాయి. దీనికి సంబంధించిన ఈ-వేలం ను ఈనెల 20న నిర్వహించనున్నట్లు ఆయా బ్యాంకుల అధికారులు తెలిపారు.

12 ఖాతాలకు చెందిన రూ. 848.54 కోట్ల ఆస్తులను వేలానికి పెడుతున్నట్లు SBI తెలిపింది. ఛండీగడ్ కు చెందిన మోడ్రన్‌ స్టీల్స్‌(రూ.122.61కోట్లు), గురుగ్రామ్‌ కు చెందిన కోర్బా వెస్ట్‌ పవర్‌ కంపెనీ(రూ.124.78కోట్లు), సూరత్‌ కు చెందిన గార్డెన్‌ సిల్క్‌ మిల్స్‌(రూ.225.06కోట్లు), సికింద్రాబాద్‌ కు చెందిన SNS స్ట్రాచ్‌(రూ.66.87కోట్లు), లైట్ విండ్ శ్రీరామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రైవేట్ లిమిటెడ్(రూ.64.95కోట్లు), యునిజులస్ లైఫ్ సైన్సస్(రూ.59.25కోట్లు), స్కానియా స్టీల్ అండ్ పవర్(రూ.42.42కోట్లు), KSM స్పిన్నింగ్ మిల్స్(రూ.40.42కోట్లు), మోడ్రన్ డైరీస్(రూ.39.93కోట్లు), అస్మిత పేపర్స్(రూ.37.23కోట్లు), ఫోరెల్ ల్యాబ్స్(రూ.22.86కోట్లు), జైపూర్ మెటల్ అండ్ ఎలక్ట్రికల్స్(రూ.2.16కోట్లు) కు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.

మరో బ్యాంకింగ్ దిగ్గజం, దేశంలో రెండో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ PNB 3ఖాతాలకు చెందిన రూ.214.45 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయనుంది. మీరట్‌కు చెందిన సిధాబలి ఇస్పాత్‌ లిమిటెడ్‌(రూ.165.30కోట్లు), చెన్నై శ్రీగురుప్రభ పవర్‌ లిమిటెడ్(రూ.31.52కోట్లు), ముంబయిలోని ధర్మనాథ్‌ ఇన్వెస్టిమెంట్‌(రూ.17.63కోట్లు)కు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.

డిసెంబర్31, 2017 నాటికి 21 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు రూ.7.33 లక్షల కోట్ల మొండిబకాయిలు ఉన్నాయి. ఇందులో SBI కి అత్యధికంగా రూ.2.01లక్షల కోట్ల మొండి బకాయిలు ఉండగా, PNB కి రూ.55,200కోట్లు, IDBI కి రూ.44,542కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.38,047కోట్ల బకాయిలు ఉన్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates