వెరీ గ్రాండ్ గా : జలవిహార్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

kcr jalaviharసీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 17న నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. భారీ కేక్ కటింగ్‌తోపాటు రక్తదాన శిబిరం, వికలాంగులకు ట్రై సైకిళ్లు, అంధులకు చేతికర్రలు, వృద్ధ మహిళలకు చీరెల పంపిణీ ఉంటుందన్నారు. రోజంతా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. వేడుకలకు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు లక్షల మంది హాజరుకానున్నారు.

 ఓయూలో ఘనంగా వేడుకలు

సీఎం కేసీఆర్ 64వ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ఓయూలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరం, కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి హాజరుకానున్నారు.

Posted in Uncategorized

Latest Updates