వెరీ షాకింగ్ : డివైడర్ ఎక్కి.. రాంగ్ రూట్ లోకి వచ్చిన బస్సు

షాకింగ్ వీడియో.. ఇది చూస్తే వణుకువస్తోంది. ఓ ఆర్టీసీ బస్సు స్పీడ్ గా వెళుతుంది.. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.. అందులోనూ జాతీయ రహదారి.. సదడన్ గా ఓ స్టూడెంట్ రోడ్డు దాటుతున్నాడు.. అంతే.. ఆ కుర్రోడిని తప్పించబోయిన బస్సు.. అదుపుతప్పి డివైడర్ ఎక్కేసింది.. అది దాటుకుని రాంగ్ రూట్ లోకి వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు వస్తున్నాయి. ఓ కారు, రెండు బైక్స్ ఎదురుగా వస్తున్నాయి.. వాటిని తప్పించుకుంటూ సేఫ్ గా ఆగిపోయింది. తప్పిన ఘోర ప్రమాదం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

యాదాద్రి  భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఈ ప్రమాదం తప్పింది. హైదరాబాద్  నుంచి  హన్మకొండ వెళ్తున్న  ఆర్టీసీ  సూపర్  లెగ్జరీ బస్సు.. బీబీ నగర్  దగ్గర  రోడ్డు  దాటుతున్న  యువకుడిని  తప్పించబోయింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవటంతో.. డివైడర్ ఎక్కేసి.. రాంగ్ రూట్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో  ఎదురుగా ఎలాంటి  వాహనాలు లేకపోవడంతో  పెను ప్రమాదం  తప్పింది. ఘటనలో  బస్సులో  ప్రయాణిస్తున్న వారు పెద్దగా కేకలు వేశారు. ఎవరికీ  ఏమీ  జరగకపోవడంతో  అంతా ఊపిరి  పీల్చుకున్నారు. జూలై 18వ తేదీ బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇది జరిగింది.. ఆ వీడియో మీరూ చూసేయండి…

Posted in Uncategorized

Latest Updates