వెరీ షాకింగ్ : స్మార్ట్ ఫోన్ పేలి.. కంపెనీ సీఈవో మృతి

ceo
స్మార్ట్ ఫోన్ పేలుతుంది అంటే.. ఎక్కడో ఒకటీ అరా జరుగుతుంటాయి.. ఓవర్ ఛార్జింగ్ పెట్టి ఉంటారు అంటూ లైట్ తీసుకుని వెళ్లిపోతున్నాం. అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా.. ఆ వెంటనే మర్చిపోతున్నాం.. మలేషియా దేశంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ మాత్రం షాకింగ్ కు గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలేషియా దేశంలో ఇన్వెస్టె మెంట్ ఫైనాన్స్ కు సంబంధించి క్రెడిల్ ఫండ్ కంపెనీ ఉంది. దానికి నజిరిన్ హుస్సేన్ సీఈవోగా ఉన్నారు. ఈ కంపెనీ మలేషియన్ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. స్టార్టప్ కంపెనీలకు ఆర్థిక సాయం చేయటంలో క్రెడిల్ కంపెనీకి మంచి పేరు ఉంది. ఈయన రెండు రోజుల క్రితం చనిపోయారు. ఎలా అంటే తన స్మార్ట్ ఫోన్ పేలటం వల్లే. ఏడాదికి కోట్లలో జీతం తీసుకునే ఓ సీఈవో.. స్మార్ట్ ఫోన్ పేలి చనిపోవటం షాకింగ్ కు గురి చేసింది.

నజిరిన్ హుస్సేన్ కు రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్లాక్ బెర్రీ, మరొకటి హువాయ్ ఫోన్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆయన.. తన బెడ్ రూంలో ఛార్జింగ్ పెట్టారు. ఆ తర్వాత నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ పేలింది. ఆ వెంటనే గది అంతా మంటలు వ్యాపించాయి. గదిలో ఎక్కువగా సోఫాలతోపాటు అత్యంత ఖరీదై బెడ్స్ ఉండటంతో నిమిషాల్లోనే గదిని చుట్టుముట్టాయి మంటలు. అందులో నుంచి బయటకు రాలేక చనిపోయారు సీఈవో హుస్సేన్. బ్యాటరీ ఓవర్ హీట్ వల్లే ఫోన్ పేలిపోయిందని.. అయితే పేలిన ఫోన్ ఏంటి అనేది కచ్చితంగా చెప్పలేం అని ప్రకటించారు పోలీసులు.

హుస్సేన్ టెక్నో ఎంటర్ ప్రెన్యూర్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు. ఇంగ్లండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మలేషియా తరపున సభ్యుడిగా కూడా కొనసాగారు. దేశంలోని వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపింది ఆ దేశం. అలాంటి వ్యక్తి.. స్మార్ట్ పోన్ పేలిన ప్రమాదంలో చనిపోవటం మరింత విషాదం.

Posted in Uncategorized

Latest Updates