వెరైటీ కిక్కు ఇది : JCBలో ఊరేగింపుగా కొత్త జంట

jcbఅతని పేరు చేతన్. ఆమె పేరు మమత. వీరిది కర్నాటక రాష్ట్రం పుత్తూరు ఏరియాలోని పరుపుంజా గ్రామం. వీళ్లిద్దరికీ పెళ్లి చేశారు పెద్దలు. చుట్టాలు, బంధువులతో హంగామా ముగిసింది. ఎవరి దారిన వారు వెళ్లారు. మిగిలింది కొత్త జంట. వీరు కూడా కల్యాణ మంటపం నుంచి ఇంటికి వెళ్లాలి. కారు, జీపు, బస్సు, లారీ ఇలా చాలా వాహనాలు ఉన్నాయి. కానీ వైవిధ్యంగా.. వెరైటీగా జేసీబీ బకెట్ లో కూర్చుని ఇంటికి వెళ్లారు. మొదట పెళ్లి కూతురు ససేమిరా అంది. అయితే పదేళ్లుగా చేతన్ జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ అనుభవంతో భార్యకు భరోసా ఇచ్చాడు. దీంతో ఒకే అంది అంట. ఆ వెంటనే స్నేహితులు జేసీబీని పూలు, కలర్ ఫుల్ కాగితాలతో డెకరేట్ చేశారు. జేసీబీ బకెట్ లో కూర్చుని వీరు ఇంటికి చేరారు.

ఇంటికి చేరిన రెండు రోజుల తర్వాత కానీ వారు చేసిన పని ఎంత పెద్ద సంచలనం అయ్యిందో. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ జేసీబీలో వీరు వెళుతున్న ఫొటోలు ప్రచురితం అయ్యాయి. ఒక్కసారిగా వారు సోషల్ మీడియా సెలబ్రిటీలు అయిపోయారు. ఇరుగుపొరుగు వారు వారిని ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టారు. వైవిధ్యం.. కిక్కు కోసం వారు చేసిన పని.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది..

Posted in Uncategorized

Latest Updates