వెలుగులోకి మరో కుంభకోణం : యూకో బ్యాంక్ కు 737 కోట్లు టోపీ

CUIనిబంధనలకు విరుద్దంగా ఎరా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్(EEIL) కంపెనీకు రుణాల మంజూరు చేసి వందల కోట్లు నష్టపోయింది యూకో బ్యాంక్. ఇందులో ప్రధాన సూత్రధారి యూకో బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్(CMD) అరుణ్ కౌల్ పై CBI కేసు నమోదు చేసింది. 2010 నుంచి 2015 వరకు బ్యాంకు సీఎండీ పనిచేసిన అరుణ్ కౌల్‌ కారణంగా బ్యాంకుకు రూ.737 కోట్లు నష్టపోయిందని సీబీఐ ఆరోపించింది. మోసం చేయాలనే కుట్రతోనే కంపెనీలకు రుణాలు మంజూరు చేయించినట్లు తెలిపింది.
2010లో ఎరా ఇన్ ప్రా రెండు విడతలుగా యూకో బ్యాంక్ నుంచి 621 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఐఎఫ్‌ సీఐ దగ్గర అధిక వడ్డీకి తీసుకున్న రుణాలను తీర్చేస్తామని వీటిని మంజూరు చేయించుకున్నారు. అయితే ఆ బ్యాంకులకు రుణాలు తీర్చకుండా నిధులను దారి మళ్లించారు. ఐ ఎఫ్ సీఐ కి సంబంధించిన రుణంలో కేవలం 59 లక్షల రూపాయలను మాత్రమే చెల్లించినట్లు CBI తెలిపింది. ఈ మొత్తం వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.737.88 కోట్లు అని తెలిపింది. శనివారం(ఏప్రిల్-14) ఢిల్లీలోని ఎనిమిది చోట్ల, ముంబయిలోని రెండుచోట్ల నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో CBI సోదాలు జరిపింది. కౌల్‌తో పాటు EEIL సిఎండీ హేమ్‌ సింగ్‌ భరానా, చార్టెడ్‌ అకౌంటెంట్లు పంకజ్‌ జైన్‌, వందనా శారదా, ఆల్టియస్‌ ఫిన్‌సెర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు చెందిన పవన్‌ బన్సాల్‌ పై కేసు నమోదు చేసినట్లు తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates