వెల్ కం సార్ : దేశంలో కెనడా ప్రధాని ఫ్యామిలీ టూర్

adeవారం రోజులు భారత్ లో పర్యటించేందుకు ఢీల్లీ చేరుకున్నారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన ఆయన ఈ రోజు(ఫిబ్రవరి17) మధ్యాహ్న 3:50 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. 2012 తర్వాత భారత్ కు వచ్చిన కెనడా ప్రధాన మంత్రి ట్రూడూనే. 23 వరకూ ఆయన భారత్ లో పర్యటిస్తారు. ప్రధాని మోడీ 2015 ఏప్రిల్ లో కెనడా వెళ్లిన సమయంలో భారత్ లో ప్యటించాల్సిందిగా ఆహ్వానించారు. మోడీ ఆహ్వానం మేరకు భారత్ కు వచ్చిన ట్రూడూ ఆగ్రా, అమతసర్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నారు. అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ సందర్శించడం ద్వారా కెనడాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న పంజాబీలకు ఓ పాజిటివ్ సంకేతాన్ని అందించనున్నారు. ఆదివారం(ఫిబ్రవరి18) తన భారత్ పర్యటనను ప్రారంభించనున్న ట్రూడూ మొదటిగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడ IIM లో జరిగే ఎడ్యుకేషన్ అండ్ ఇన్వస్ట్ మెంట్ అనే అంశంపై ఆయన విద్యార్ధులతో డిస్కస్ చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates