డ్రైవింగ్ చేసిన వ్యక్తులదే అసలు తప్పుని తెలిసినా.. మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించడం సాధ్యం కావట్లేదు. దీంతో ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఒకే తరహాలో జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో అనుసరిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకుని ఉల్లంఘనల నమోదును డ్రైవర్ ఆధారంగా చలానాలు నమోదు చేయాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు.
దీని ఆధారంగా రూపొందే డేటాబేస్ ద్వారా.. తరచూ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తిస్తారు. ఆర్టీఏ, న్యాయస్థానాల సహకారంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ విధానం త్వరలో సిటీ మొత్తం అమల్లోకి రానుంది.
పెండింగ్లో ఉన్న ఈ–చలాన్ల సంఖ్య నగరంలో భారీగానే ఉంది. ఉల్లంఘనలకు పాల్పడిన డ్రైవర్లకు పోలీసులు SMS రూపంలో రిమైండర్స్ పంపుతున్నారు. అయితే ఇప్పటికే వేల సంఖ్యలో వాహనాలు సెకండ్ సేల్స్ కింద చేతులు మారాయి. దీంతో పాత వారికే చలానా వెళుతుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు.. డ్రైవర్ కేంద్రంగా చలానాలు నమోదు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్లు అందరి ఫోన్ నంబర్ల సేకరణలో వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) విధానం అమలు చేయనున్నారు. ఈ విధానంతో మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం తేలిక అవుతుందని ట్రాఫిక్ అధికారులు చెబున్నారు.