వెహికిల్ పోయిందా…వీలైతే కొత్తది కొనుక్కోండి

VEHIKILSటు వీలర్…మరేదైనా వెహికిల్ పోతే..దానిపై ఆశలు వదులుకోండి. వీలైతే కొత్త వెహికిల్ కొనుక్కొండి. అంతే కానీ దానికి కోసం వెతకడం…పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వేస్ట్. ఎందు కంటే ఇప్పటికే వెహికిల్స్ పోయిన వాళ్లు ఫిర్యాదు చేసి నెలలు కాదు ఏకంగా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయినా ఫలితం లేదు.

రాష్ట్రంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక దగ్గర బైక్స్, ఆటోలు, కార్లు.. కొన్ని చోట్ల ఏకంగా లారీలు కూడా మాయమైపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీసుల దర్యాప్తు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ఏటా వేల సంఖ్యలో వాహనాలు కొల్లగొడుతున్నారు. గడిచిన మూడేళ్లలో 12,243 వాహనాలు చోరీకి గురైనట్టు పోలీస్‌ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన గ్యాంగులు వాహనాల చోరీలకు పాల్పడుతున్నాయి. ఈ ముఠాలకు స్థానిక ముఠాలు ఆశ్రయం కల్పించడం, లాజిస్టిక్‌ సపోర్ట్‌ చేయడం, వాహనాలు రాష్ట్రం దాటించడం చేస్తూ దోపిడీ సొత్తులో వాటా పంచుకుంటున్నాయి.

12,243 వాహనాల్లో 22 శాతం కార్లు చోరీ కాగా… 14 శాతం ఆటోలు, 2 శాతం భారీ వాహనాలు ఉన్నట్లు పోలీస్‌ రికార్డుల్లో చెబుతున్నాయి. అందులో మిగిలిన 62 శాతం బైక్స్ దొంగతనం అయ్యాయి. వాహనం చోరికి గురైన కేసుల్లో పోలీసులు పెద్దగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. వాహనాల తనిఖీలు, కార్టన్‌ సెర్చ్‌.. తదితర సమయాల్లో పట్టుబడ్డ వాహనాలు నెలలకొద్దీ స్టేషన్లలోనే మూలుగుతుంటాయి. పట్టుబడ్డవి నిజంగా దొంగ వాహనాలు అయితే వాటి అసలు యజమానులు ఎవరు? వాహనం ఎక్కడ చోరీకి గురైంది? తదితర వివరాలను సేకరించాలి. కానీ ఎక్కడా అలా చేసిన దాఖలాలు లేవు. దొరికిన వాహనాలను స్టేషన్లలో తుప్పు పట్టేదాకా ఓ మూలన పడేయాల్సిందే. ఇదే రీతిలో గోషా మహల్‌లోని స్టేడియంలో వేలాది వాహనాలు మూలనపడ్డాయి. మరికొన్ని కేసుల్లో చోరీకి గురైన వాహనాలు దొరి కినా కేసు చార్జిషీట్‌ దశలో ఉందని, కోర్టు ద్వారా తీసుకో వాలని పోలీసులు చెబుతుండటంతో బాధితులు తమ సొత్తుపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

Posted in Uncategorized

Latest Updates