వేగం పెంచండి : వారం ముందే బతుకమ్మ చీరలు

సెప్టెంబర్ చివరి వారంలోగా బతుకమ్మ చీరలు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. శనివారం (జూలై-14) క్యాంప్ ఆఫీసులో బతుకమ్మ చీరల తయారీ, పంపిణీపై టెక్స్ టైల్స్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రభుత్వం ఇచ్చిన 90 లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ ని కచ్చితంగా పండగకు వారం రోజుల ముందే అందివ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం చీరలను వేస్తున్న వేగాన్ని, లూమ్ లను మరింతగా పెంచాలన్నారు. రెండు షిఫ్టుల్లో పని చేయాలని కోరారు. సిరిసిల్లలో ప్రస్తుతం 10వేల లూములపైన బతుకమ్మ చీరల నేత కార్యక్రమం నడుస్తుందని మంత్రికి వివరించారు అధికారులు. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ముందుకు వెళ్లాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates