వేగవంతంగా సింగరేణిలో కారుణ్య నియామకాలు

సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణిలో కారుణ్య నియామకాలు స్పీడందుకున్నాయి. నాలుగు నెలల్లోనే 10 మెడికల్ బోర్డులను నిర్వహించినట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. 1,344 మంది అన్‌ఫిట్ కార్మికుల స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రామగుండంలో ఒకేసారి 42 మందికి నియామక పత్రాలు అంజేశామన్నారు. ప్రతి నెల సాధ్యమైనంత ఎక్కువగా మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న కార్మికులందరిని మెడికల్ బోర్డు పరీక్షలకు పిలుస్తున్నామని…. అన్‌ఫిట్ కార్మికుడు సూచించిన వారసులను వెంటనే ఉద్యోగంలో నియామకం చేస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates