వేటాడి వెంటాడి…భార్యను నడిరోడ్డుపై నరికి చంపాడు

murderఇక్కడా… ఇక్కడా అనే తేడా లేకుండా దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో అక్కడ ….మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా  ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై అడవి మృగాన్ని వేటాడినట్టుగా వెంటాడి వేటకొడవలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘనట తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిండిగల్‌ జిల్లా రాజపాలెంలో గత నెల 20న ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే తన భార్యపై దాడి చేశాడు. మదీశ్వరన్‌ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డులో తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో అత్యంత కిరాతంగా నరికాడు. ఆ మహిళ ఆర్థనాధాలు చేస్తున్నా అక్కడున్న స్థానికులందరూ ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారు అప్ప…ఎవరూ దగ్గరకు రాలేదు. తర్వాత అతను పారిపోయాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.  మదీశ్వరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ప్రియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. కుటుంబ కలహాలే దీనికి కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్‌లో జరిగిన ఈ దారుణం సీసీ ఫుటేజీలో రికార్డుకావడంతో ఆ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates