వేటుకు రంగం సిద్ధం : డీఎస్ పై చర్యలకు నిజామాబాద్ నేతల డిమాండ్

kavith-dsరాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు. జూన్ 27వ తేదీ బుధవారం ఉదయం నిజామాబాద్ పట్టణంలో ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని.. పార్టీకి నష్టం కలిగించే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆయనపై పార్టీ నాయకత్వం యాక్షన్ తీసుకోవాలని.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అందులో ఎంపీ కవితతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సంతకాలు చేశారు.

ఆరు, ఏడు నెలలుగా డీఎస్ కుటుంబ సభ్యులు మరో పార్టీలో చేరారని.. వారికి అండగా ఉండాలని, ఆ పార్టీలో చేరాలని టీఆర్ఎస్ కార్యకర్తలపై ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు ఎంపీ కవిత. కుటుంబంలోని అంశాలను కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల.. టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుందన్నారు. పలుసార్లు డీఎస్ తోనూ చర్చించినట్లు కూడా వెల్లడించారు. పార్టీ కోసం కాకుండా.. డీఎస్ కుటుంబం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ఆయనపై పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంకి లేఖ రాశారు.

Posted in Uncategorized

Latest Updates