వేడి తగ్గింది: చేతులు కలిపిన ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్

kim-trumpఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డం అంటారు. పరస్పరం ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటారు ఆ ఇద్దరు దేశాధ్యక్షులు. ఇందులో ఒకరు అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, మరొకరు నియంత సమ్రాజ్యానికి అధిపతి. ఈ ఇద్దరు దేశాధినేతలు ఇప్పుడు స్నేహితుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చూసి ప్రజలంతా ఆశ్యర్యపోతున్నారు. వారే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ లో జరుగుతున్నవింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ఉన్, అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ హాజరయ్యారు. ఇద్దరు దేశాధినేతలు స్నేహితుల్లా చెట్టాపట్టాలేసుకుని మరీ వచ్చారు. వారిని చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్యర్యపోయారు. అయితే అందరూ అనుకున్నట్లు వారు అసలైన కిమ్, ట్రంప్ కాదు. ఆస్ట్రేలియాకు చెందిన హోవార్డ్ కిమ్లా,  అమెరికాకు చెందిన డెన్నిస్ లు ట్రంప్ వేషదారణలతో ఒలంపిక్స్ చూడటానికి వచ్చారు. వీరిని చూసేందుకు, కలసి సెల్ఫీలు తీసుకొనేందుకు ప్రజలు ఎగబడటంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు బాగానే శ్రమించాల్సి వచ్చిందట.

 

Posted in Uncategorized

Latest Updates