వేణుమాధవ్ మృతిపట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

cm-kcr-nerella-venuధ్వని అనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతి మిమిక్రీ కళారంగానికి తీరని లోటు అన్నారు.ప్రముఖ మిమిక్రీ కళాకారుడిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన మిమిక్రీ కళకు పితామహుడని ప్రశంసించారు సీఎం. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని కొనియాడారు. మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా నేరెళ్ల మలిచారు అని పేర్కొన్నారు కేసీఆర్. నేరెళ్ల వేణుమాధవ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్‌కే జోషికి ఆదేశాలు జారీ చేశారు సీఎం.

Posted in Uncategorized

Latest Updates