వేదా కృష్ణమూర్తి పై వేటు

ఇండియా మహిళా జట్ల కెప్టెన్లు మారలేదు. న్యూజిలాండ్‌ టూర్‌కు  వెళ్లే వన్డే, టీ20ల్లో తలపడే జట్లకు మిథాలీరాజ్‌, హర్మన్‌ ప్రీత్‌ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. అయితే ఫామ్‌‌లో లేని వేదా కృష్ణమూర్తికి రెండు జట్లలోనూ స్థానం దక్కలేదు. జనవరి 24న మొదలయ్యే ఈ సిరీస్‌‌లో కివీస్‌తో ఇండియా మూడు వన్డేలు…మూడు టీ20 ల్లో పోటీపడుతుంది. టీ20 వరల్డ్‌‌కప్‌ తర్వాత ఇండియా జట్టు ఆడబోతున్న తొలి సిరీస్‌ ఇదే. కొత్త కోచ్‌ WV రామన్‌ పర్యవేక్షణలో మహిళా జట్టు ఆడబోయే మొదటి సిరీస్‌ కూడా ఇదే. కివీస్‌ టూర్‌కు జట్టు ఎంపిక కోసం నిన్న(శుక్రవారం) జరిగిన మీటింగ్‌కు వన్డే కెప్టె న్‌ మిథాలీ రాజ్‌ హాజరుకాగా, టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ ఆస్ట్రేలియా నుంచి స్కైప్‌ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంది. అయితే .. వేదా కృష్ణమూర్తి స్థానంలో మోనా మెష్రమ్‌కు వన్ జడే ట్టులో చోటు దక్కింది. ఇక టీ20 జట్టులో గాయపడ్డ పూజా వస్త్రాకర్‌ బదులుగా శిఖా పాండేను తీసుకున్నారు. కొత్త ప్లేయర్‌ ప్రియా పునియాకు అవకాశం కల్పించారు. టీ20 టీమ్‌‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ అరుంధతి రెడ్డి చోటు దక్కించుకుంది.

 

Posted in Uncategorized

Latest Updates