వేధింపులను అరికట్టాలని..వృద్ధుల మౌన ప్రదర్శన

OLD MANవృద్ధులపై జరుగుతున్న వేధింపులతో ఆందోళనలు పెరుగుతున్నాయి. వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవెర్నెస్ డే సందర్భంగా ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అద్శర్యంలో మేళా నిర్వహిస్తున్నారు. దోమలగూడ ఏవీ కాలేజ్ మైదానంలో శుక్రవారం (జూన్-15) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. వయో వృద్ధులపై జరుగుతున్న దాడులు, వేధింపులకు నిరసనగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో మౌన ప్రదర్శన చేశారు. ఇందులో మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఎల్డర్స్ మేళాలో సీనియర్ సిటిజెన్స్ పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates