వేములవాడలో శివరాత్రి సందడి

Vemulawada1వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు సోమవారం (ఫిబ్రవరి-12) వైభవంగా మొదలయ్యాయి. ఉదయం గణపతిపూజ, స్వస్తి వచనం, పుణ్యావచనం తర్వాత పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు స్వామివారి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం సర్వం సిద్దం చేశారు ఆలయ అధికారులు. పండుగ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శివరాత్రి సందర్భంగా ఇప్పటికే వేములవాడ చేరుకుంటున్నారు భక్తులు.

శివరాత్రికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా మొబైల్ యాప్, సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా పార్కింగ్, అనుబంధ ఆలయాల సమాచారం, దర్శనం, ప్రసాదం, ఇతర వివరాలను తెలుసుకోవచ్చాన్నారు జిల్లా కలెక్టర్. ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోచ్చని తెలిపారు.

మంగళవారం (ఫిబ్రవరి-12) శివరాత్రి సందర్భంగా ఆలయంలో నిఘా పెంచారు. 3 లక్షలకు పైగా జనం వచ్చే అవకాశం ఉండడంతో.. అవాంచనీయ ఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ 500 సీసీ కెమరాలు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు.

శివరాత్రి సందర్బంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, మహాలింగార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ కాలంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates