వేములవాడ రాజన్నకు దేవాదాయశాఖ పట్టువస్త్రాలు

ikreddyshivరాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు మంగళవారం (ఫిబ్రవరి-13) ఘనంగా కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, టీటీడీ తరపున JEO శ్రీనివాస్ రాజు పట్టు వస్ర్తాలు సమర్పించారు.  రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రకరణ్ రెడ్డి.. గత పాలకులు పట్టించుకోని ప్రాచీన చరిత్ర కలిగిన ప్రధాన ఆలయాలను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.

రాజన్న క్షేత్రం అభివృద్ధిని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వచ్చే వానా కాలంలో వర్షాలు సమృద్ధిగా కురియాలని, ప్రజలు పాడి, పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates