వేలాదిగా తరలివచ్చారు : స్వగ్రామంలో ముగిసిన రైఫిల్ మన్ ఔరంగజేబ్ అంత్యక్రియలు

JEBఉగ్రవాదులు కిడ్నాప్ చేసి.. హత్య చేసిన రైఫిల్ మన్ ఔరంగజేబ్ అంత్యక్రియలు పూంచ్ సమీపంలోని ఆయన స్వగ్రామంలో జరిగాయి. అమర జవాన్ కు తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఔరంగజేబ్ అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఉద్యోగంలో చేరే సమయంలో చేసిన ప్రతిజ్ఞకు తన కుమారుడు కట్టుబడి ఉన్నాడని.. అందుకే దేశం కోసం ప్రాణాలర్పించాడని ఔరంగజేబ్ తండ్రి మహ్మద్ హనీఫ్ తెలిపారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని కోరారు హనీఫ్.

Posted in Uncategorized

Latest Updates