వేలానికి సిద్ధమైన బాలాపూర్ లడ్డూ

బాలాపూర్ గణేష్ శోభాయాత్ర పూజ ప్రారంభమైంది.ఊరేగింపునకు సంబంధించి ఉత్సవ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో పాటు లడ్డూ వేలానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. లడ్డూతో పేరు వచ్చిన బాలాపూర్‌ వినాయకుడిని పెద్దఎత్తున భక్తులు దర్శించుకుంటుంటారు.

లడ్డూవేలంలో పాల్గొనేందుకు ఏడుగురు TRS అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూవేలంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పేరు నమోదు చేసుకున్నారు. అయితే రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వాల వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది నిర్వహణ కమిటి. రాజకీయ నాయకులకు అవకాశం ఇస్తే లడ్డూ రేట్ అమాంతం పెరిగే అవకాశముందని.. వేలం సమయం వరకు వారికి అవకాశం ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నిర్వాహకులు.

నవరాత్రులు పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాడు. సుమారు 9 గంటల వరకు గ్రామ బొడ్రాయి దగ్గరకు గణనాథుడు చేరుకోగానే ప్రముఖుల ఉపన్యాసాలు ముగియగానే 9.30 గంటల సమయంలో లడ్డూ వేలాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మరో గంటకు బాలాపూర్‌ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది.

1994 లో మొట్టమొదటి సారిగా బాలాపూర్ లడ్డు వేలంలో 450 రూపాయలకు కొలన్ మోహన్ రెడ్డి దక్కించుకోగా…గతేడాది 15 లక్షల 60 వేలకు లడ్డును సొంతం చేసుకున్నారు నాగం తిరుపతి రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates