వేసవిలోనూ తాగు నీటికి కొరత లేదు : కేటీఆర్

KTR KKతెలంగాణ వస్తే హైదరాబాద్ ఏమైపోతదోనని కామెంట్ చేశారని, కానీ..ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ పేరు వినిపిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. సిటీ పర్యటనలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్-13)న కూకట్ పల్లిలో పర్యటించారు. మోతీ నగర్ లో రిజర్వాయర్ వాటర్ ట్యాంకును ప్రారంభించిన కేటీఆర్.. 24 గంటల కరెంటు ఇచ్చామని, ప్యాక్టరీలకు, వ్యవసాయానికి కరెంటు కోతలు లేకుండా చేసిన ఘనత TRS ప్రభుత్వానిదన్నారు. ఖైరతాబాద్ ప్రాంతాల్లో నీళ్ల కోసం నానా తంటాలు పడేవారిని, ఇప్పుడు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నామని, వేసవిలోనూ తాగునీటికి కొరత లేకుండా చేస్తున్నామన్నారు.

భవిష్యత్తులో హైదరాబాద్ లో నీటి కొరత లేకుండా చూస్తామన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ అల్లకల్లోరం అవుతుందన్న వారికి..అభివృద్ధితో సమాధానం చెబుతున్నామన్నారు మంత్రి. హైదరాబాద్ కి ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయని, ఐటీలో దేశంలోనే టాప్ లో మన హైదరాబాద్ ఉందన్నారు. పట్నంలోనే కాదు..పల్లెల్లోనూ 24 గంటల కరెంటు ఇవ్వడం దేశంలోనే ఫస్ట్ అన్నారు. హైదరాబాద్ లో నాణ్యమైన నీళ్లనిస్తున్నామన్నారు. మోతీ నగర్ లో 10 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చామని, ప్రతి రోజు మంచి నీళ్లు వచ్చేలా ప్లానింగ్ చేస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates