వైఎస్ఆర్ రైతుభరోసా కాదు..వైఎస్ఆర్ రైతు నిరాశ : నారా లోకేష్

ఏపీ మాజీ మంత్రి నారాలోకేష్  సీఎం జగన్ పై మండిపడ్డారు. రైతు భరోసా, పెట్టుబడి సాయంపై ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. కులాన్ని పట్టించుకోం అంటూనే ఓసీ కౌలు రైతులకు మొండి చెయ్యి చూపారని అన్నారు.  పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామన్న జగన్ .. ఇప్పుడు విడతల వారీగా ఇస్తూ మాటతప్పారన్నారు.  వైసీపీ వాలంటీర్లకు నెలకు రూ.8వేలు ఇస్తూ.. ఆరుగాలం కష్టపడే రైతన్నకు రూ.625 ఇవ్వడం న్యాయమా..?అని ప్రశ్నించారు.

రైతు భరోసాపై చురకలంటించిన లోకేష్.. జగన్ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ రైతుభరోసా కాదని, వైఎస్ఆర్ రైతు నిరాశ కార్యక్రమమని ఎద్దేవా చేశారు.  ఎన్నికల హామీల్లో  రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం రూ.7,500 ఇస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు.  రైతు భరోసా పథకంలో భాగంగా  64 లక్షల మంది రైతుల్లో సగం మంది  రైతుల్ని తగ్గించుకుంటూ పోయారని లోకేష్ ట్వీట్ చేశారు.

Latest Updates