వైద్యసేవల్లో ఇంకా అభివృద్ధి జరగాలి : రాష్ట్రపతి రామ్ నాథ్

కరీంనగర్ : అందరికీ ఆరోగ్యం నినాదంతో ప్రతీ ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రెసిడెంట్ రాంనాధ్ కోవింద్. పోలియోను తరిమినట్టే…తలసేమియాని కూడా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన రాష్ట్రపతి… నగునూరులోని ప్రతిమా మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్థుల చికిత్సా విభాగాన్ని ప్రారంభించారు. తర్వాత మెరిట్ విద్యార్ధులకు బంగారు పతకాలను అందించారు.

ప్రపంచవ్యాప్తంగా మన డాక్టర్లకు ఎంతో గుర్తింపు ఉందన్నారు రాష్ట్రపతి కోవింద్. వైద్య సేవల రంగంలో మనం ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉందన్నారు. చిన్నారుల్లో తలసేమియా సమస్య ఇంకా బాధిస్తోందని.. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం ద్వారా తలసేమియాను నివారించొచ్చన్నారు రాంనాథ్. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రపతి. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates