వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులు : లక్ష్మారెడ్డి

LAKSHMAతెలంగాణ రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖలో త్వరలోనే 10 వేల పోస్టులను భర్తీ చేస్తామన్నారు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. బుధవారం (ఫిబ్రవరి-7) మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి.

Posted in Uncategorized

Latest Updates