వైద్య రంగంలో దేశం అభివృద్ధి సాధిస్తోంది : రాష్ట్రపతి

వైద్యరంగంలో మనదేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌. కరీంనగర్‌లో ప్రతిమ మెడికల్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఆడిటోరియాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రతిభ చూపిన MBBS విద్యార్థినీ, విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి.. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా  వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. వైద్య రంగంలో అభివృద్ధి సాధించినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా బాధిస్తోందన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రజలకు ఒక వరం అన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.

 

Posted in Uncategorized

Latest Updates