వైభవంగా భద్రాద్రి రాముడి పట్టాభిషేకం

భద్రాద్రిలో కల్యాణ రాముడి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం (మార్చి-27) సీతా సమేత శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించారు. ముందుగా కలశాలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి అష్టోత్తర శతానామార్చన చేశారు.

పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా…పాదుకలను శ్రీరాముడికి సమర్పించారు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకం ఇలా ఒక్కోటిగా శ్రీరాముడికి అలంకరించారు. తర్వాత వైభవంగా రామచంద్రునికి కిరీటాన్ని సమర్పించారు. చివరగా వివిధ నదుల తీర్థాలతో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారికి అభిషేకం నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates