వైభవంగా సీతారాముల కల్యాణం

SEETHARAMULA KALYANAMశ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సీతారాముల కల్యాణంలో భక్తులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రామాలయాలన్నీ రామనామ సంకీర్తనలతో మార్మోగుతున్నాయి. తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధి మిథిలాస్టేడియం కల్యాణ మండపంలో సోమవారం (మార్చి-26) సీతారాముల కల్యాణ వేడుక వైభవంగా జరుగుతోంది.

మిథిలాస్టేడియం ప్రాంగణంలో చలువ పందిళ్లను చాందినీ వస్ర్తాలు, తోరణాలతో అందంగా అలంకరించారు. మండపం ఆవరణ మొత్తం సెక్టార్లుగా విభజించారు. తరలివచ్చే భక్తజనులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో భద్రాద్రి సందడిగా మారింది. రామాలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates