వైమానిక దళంలో ఉద్యోగాలు

pilots
రక్షణ రంగంలో  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. డిగ్రీ అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో కమిషన్డ్ ఆఫీసర్ హోదా పొందే అవకాశం కల్పించడంతో పాటు మంచి సాలరీ పొందేలా అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ అర్హతతో భారత వైమానిక దళంలో ఫ్లయింగ్‌ (పైలట్‌), గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో 182  ఉన్నతస్థాయి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది రక్షణ శాఖ. ఈ పోస్టులకు విద్యార్థినులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
….ఫ్లయింగ్‌ బ్రాంచి(పైలట్):
విద్యార్హత: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌ / +2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివి..60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
ఏజ్ లిమిట్:  జులై 1, 2019 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు… కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండకూడదు.
….గ్రౌండ్‌ డ్యూటీ  టెక్నికల్‌ బ్రాంచి 
విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రికల్‌ లేదా కమ్యూనికేషన్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌… తదితర విభాగాల్లో ఎందులోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్‌/ +2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఏరోస్పేస్‌ లేదా ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ మెయింటెనెన్స్‌ లేదా మెకానికల్‌ లేదా ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ వీటిలో ఏ విభాగంలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: పై రెండు పోస్టులకు జులై 1, 2019 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎత్తు: పురుషులైతే 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
….గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్ 
ఇందులో 4 విభాగాలున్నాయి. 1. అడ్మినిస్ట్రేషన్‌ 2. లాజిస్టిక్స్‌ 3. అకౌంట్స్‌ 4. ఎడ్యుకేషన్‌. అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
అకౌంట్స్‌: 60 శాతం మార్కులతో బీకాం.
ఎడ్యుకేషన్‌: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పీజీలో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, సైకాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం, పబ్లిక్‌ రిలేషన్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ వీటిలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: పై నాలుగు పోస్టులకు జులై 1, 2019 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపువాళ్లు అర్హులు.

ఎత్తు: పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
NCC స్పెషల్‌ ఎంట్రీ విభాగానికి NCC సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు 10+2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ల్లోనూ 60 శాతం తప్పనిసరి.
మెటీరియాలజీ బ్రాంచి: ఈ బ్రాంచి కూడా గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగంలోకే వస్తుంది. డిగ్రీలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కనీసం 50 శాతం మార్కులతో సైన్స్‌ కోర్సుల్లో పీజీ పూర్తిచేసివవారు అర్హులు.

అభ్యర్థుల ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. టెక్నికల్‌ బ్రాంచి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో వంద మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్‌ -1లో ప్రతిభ చూపిన వారు స్టేజ్‌ -2కి వెళ్తారు. స్టేజ్‌ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ తర్వాత కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులను శిక్షణలోకి తీసుకుంటారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో జూన్‌ 16 నుంచి జులై 15 వరకు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
వెబ్‌సైట్‌: https://afcat.cdac.in, http://careerairforce.nic.in

Posted in Uncategorized

Latest Updates