నెట్టింట్లో వైరల్ అవుతున్న డాక్టర్..ఎందుకంటే..?!

డాక్టర్ను దేవుడితో పోలుస్తాం. అందుకు తగ్గట్టే డాక్టర్లు సైతం తమ వైద్యంతో ప్రాణం పోస్తున్నారు. అలాంటి ఓ డాక్టర్ కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే ఈ కష్ట సమయాల్లో కరోనా వైరస్ సోకిన బాధితులకు డాక్టర్లే అండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ సోకుతుందని తెలిసినా ప్రాణాలకు తెగించి బాధితుల్ని కాపాడుతున్నారు. అందుకు డాక్టర్లకు మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే.

తాజాగా తమిళనాడు మద్రాస్ మెడికల్ మిషన్ ఆస్పత్రి వైద్యులు కరోనా వైరస్ సోకిన బాధితులకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. అయితే బాధితుల్ని చూసుకునేందుకు వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో డాక్టర్లే పేషెంట్లకు దగ్గరుండి అన్నీ పనులు చేస్తున్నారు. మద్రాస్ మెడికల్ మిషన్ ఆస్పత్రిలో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జార్జ్ అబ్రహం  కరోనా సోకిన రోగికి స్వయంగా అన్నం తినిపించారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.

Latest Updates