వై వేస్ట్: మోడీ కేర్ మాకు అవసరం లేదు

mamata---4_647_012816082535_110716050905నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీమ్ అంటూ బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ తమకు అవసరం లేదని మమతా బెనర్జీ తేల్చి చెప్పింది. మంగళవారం(ఫిబ్రవరి13) జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్ లో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ రాష్ట్రంలో 50 లక్షల మంది స్వాస్త్య సాథి కార్యక్రమంలో భాగస్వాములయ్యారని, మోదీ కేర్ తమకెందుకని సీఎం మమతా బెనర్జీ అన్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నుంచి తప్పుకున్న తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఓ కార్యక్రమం మాకు ఉన్నపుడు మరోదానిపై ఎందుకు ఖర్చు చేయాలి? అని మమతా ప్రశ్నించారు. గత సీపీఎం ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పులపాలు చేసినా ఈ కార్యక్రమాన్ని తాము సమర్థంగా అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates