వ్యతిరేకం కాదు : SC,ST చట్ట సవరణపై స్టే కు సుప్రీం నిరాకరణ

SPచట్టాన్ని ఏ మాత్రం బలహీనపరచడం లేదని, అమాయకులకు శిక్షలు పడకూడదన్నదే తమ ఉద్దేశమని, SC,ST చట్టానికి తాము వ్యతిరేకం కాదని సుప్రీం కోర్టు ఈ రోజు(ఏప్రిల్3) తెలిపింది. SC,ST అట్రాసిటీ చట్టంలో సవరణ చేస్తూ మార్చి20న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ను వ్యతిరేకిస్తూ సోమవారం భారత్ బంద్ కు దళిత సంఘూలు పిలుపునిచ్చాయి. అయితే బంద్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొని కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వెంటనే ఈ చట్ట సవరణను పునః పరిశీలించాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ పై ఈ రోజు(ఏప్రిల్3) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆందోళన చేస్తున్న వారు చట్ట సవరణ తీర్పును సరిగ్గా చదివి ఉండకపోవచ్చని, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టు తెలిపింది. మార్చి 20న ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. రెండు రోజుల్లో అన్ని పార్టీలు దీనికి సంబంధించి సమగ్ర స్పందనలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ అంశంపై పది రోజుల తర్వాత మరోసారి విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates