వ్యవసాయం వ్యాపారం కాదు..జీవన విధానం: సీఎం కేసీఆర్

live-kcrవ్యవసాయం కమర్షియల్ కాదు, వ్యవసాయం అంటే జీవన విధానం అన్నారు సీఎం కేసీఆర్.రాజేంద్రనగర్ లోని రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు లో పాల్గొన్న సీఎం మాట్లాడారు. గతంలో రైతు చుట్టూ సమాజం తిరిగేదన్నారు. వ్యవసాయ అభివృధ్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రైతు బతుకు చప్రాసీ కన్నా దారుణంగా తయారైందన్నారు. గతంలో సకాలంలో వర్షాలు పడేవని ఇప్పుడు అటువంటి పరిస్ధితులు లేవన్నారు. గత ప్రభుత్వాల అవివేకం వల్ల, చెట్లను నరికేయడం వల్ల, వాతావరణ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీయడం వలనే కరువు పరిస్ధితులు వస్తున్నాయన్నారు.

సమైక్యరాష్ట్రంలో తెలంగాణాకు నీళ్లు, కరెంట్ సరిగ్గా ఇవ్వలేదన్నారు. తెలంగాణాలో ఇప్పుడు అన్నీ రంగాలకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. రైతు బిడ్డనే వ్యవసాయశాఖ మంత్రిగా పెట్టుకున్నామని, ఆయనకు లక్ష్మీ పుత్రుడు అని బిరుదు ఇచ్చామన్నారు. వ్యవసాయ శాఖ అధ్బుతంగా పని చేస్తుందన్నారు. కొత్త రాష్ట్రంలో గోదాముల సంఖ్య పెంచామన్నారు. 24 మెట్రిక్ టన్నుల సామర్ధంతో గోదాములు నిర్మించామన్నారు. రైతులను విడతల వారీగా ఇజ్రాయెల్ పంపిస్తామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా భూ రికార్డుల ప్రక్షాలనతో రికార్డ్ క్రియేట్ చేశామన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమిస్తున్నామన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ ఎవరేం తింటున్నారో వివరాలున్నాయన్నారు. రాష్ట్రంలో సాగునీటి పధకాలకు ప్రపంచస్ధాయి గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కోటి 42 లక్షల వివాద రహిత భూమి ఉందన్నారు. ప్రతీ పంట లెక్క అధికారుల దగ్గరుండాలన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates