వ్యవసాయశాఖ నిర్ణయం : పెట్టుబడి చెక్కులపై కేసీఆర్ ఫొటో

Kalvakuntla-Chandrasekhar-Rao-Telangana-today-1024x683రైతుల కోసం ఎకరానికి 4 వేలు ఎరువుల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మే నుంచి ఈ డబ్బులు రైతులకు అందజేయనున్నారు అధికారులు. అయితే పెట్టుబడి పథకం కింద రైతులకు అందజేసే చెక్కులపై సీఎం కేసీఆర్‌ బొమ్మను ముద్రించేందుకు వ్యవసాయశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఎకరాకు రూ.4 వేలు లక్షలాది మంది రైతులకు వేల కోట్ల రూపాయలు అందజేసే కార్యక్రమం కావడంతో చెక్కులపై సీఎం బొమ్మ ఉంటే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే బ్యాంకు వర్గాలు దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రిజర్వ్‌ బ్యాంకు నిబంధనల ప్రకారం చెక్కులపై ఫొటోలను ముద్రించే పరిస్థితి అయితే లేదు. ఇతర రాష్ట్రాల్లో గతంలో అలా ముద్రించారా లేదా తెలుసుకుంటాం.

ప్రభుత్వమే ఆర్డరిచ్చి చెక్కులను ముద్రిస్తుండటం.. భారీ సంక్షేమ కార్యక్రమం కావడంతో ప్రత్యేక అనుమతితో సీఎం ఫొటో ముద్రించే అంశాన్ని పరిశీలిస్తాం అని కొందరు బ్యాంకు అధికారులు చెప్పినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే చెక్కును గులాబీ రంగులో ముద్రించడానికి ఇబ్బందేమీ ఉండదని బ్యాంకు వర్గాలు అన్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ రెండు అంశాలపై స్పష్టత రానుంది. రైతులకు గ్రామసభల్లో చెక్కులను పంపిణీ చేసే సమయంలో సీఎం బొమ్మ ఉంటేనే పథకానికి విస్త్రృత ప్రచారం వస్తుందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్‌ కోసం మే 15 నాటికే రైతులకు పెట్టుబడి పథకం కింద చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates