వ్యవసాయ అభివృద్ధి కోసమే అగ్రి కాలేజ్ : పోచారం

POCHARAM AGRIవ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేందుకే సిరిసిల్లలో అగ్రికల్చర్ కాలేజ్ శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి.  బుధవారం (జూన్-13) సిరిసిల్లలో అగ్రికల్చర్ కాలేజ్ కు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్, పోచారం. ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం..కేటీఆర్ కృషితో ఇప్పటికే పాలిటెక్నిక్ కాలేజీని నిర్మించుకోగా..ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీ రావడం సంతోషకరమన్నారు.

రైతాంగానికి అధిక లాభాలు వచ్చే విధానాలను యూనివర్సిటీలో సైంటిస్టులు రూపొందిస్తారని, వీటిని రైతుల వద్దకు ప్రొఫెసర్ల వచ్చి,   వ్యవసాయ అవగాహన కల్పించేందుకే ఈ కాలేజీని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అగ్రి కాలేజీతో ఈ ప్రాంతంలోని విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు పోచారం.

BSC అగ్రికల్చర్ కోర్సు ఈ కాలేజీలో ఉంటుందన్నారు. ఈ ఇయర్ నుంచే అడ్మిషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు . ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర పేరును తలపించేలా మంత్రి కేటీఆర్ కృషి అమోగం అన్నారు పోచారం. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో దేశంలోనే ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధు, మిషన్ కాకతీయ, రైతుభీమ లాంటి పథకాలతో రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు ..తూములు ఎక్కడి పనులు అక్కడ శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు పోచారం.

Posted in Uncategorized

Latest Updates