వ్యవసాయ రంగంలో ప్రభుత్వ కృషికి నిదర్శనమే ఇండియా టుడే అవార్డ్: పోచారం

pocharamరైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ కృషికి నిదర్శనమే…ఇండియా టుడే అవార్డని చెప్పారు.  ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుని తన ప్రసంగాల్లో ప్రస్తావించడం గొప్ప విషయమన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన రైతుబీమా అవగాహాన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రైతుసమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates