వ్యాక్సిన్‌‌ రెడీ అయినా.. ప్రజలకు చేరేదెట్ల?

ఒక బోయింగ్‌ 777 కార్గో ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ ద్వారా 10 లక్షల ఇండివిడ్యువల్‌ వ్యాక్సిన్ డోస్‌ లను రవాణా చేయొచ్చు. ఈ లెక్కన చూస్తే, ప్రపంచంలోని సగం మంది జనాభాకు వ్యాక్సిన్‌‌ను రవాణా చేయాలంటే 8,000 కార్గో విమానాలు అవసరమవుతాయి. రవాణాలో వ్యాక్సిన్‌‌ను 2-8 డిగ్రీల టెంపరేచర్‌‌ మధ్యే ఉంచాలి.

హైదరాబాద్‌‌, బిజినెస్‌ డెస్క్‌‌: కరోనాకు వ్యాక్సిన్‌ ను డెవలప్‌ చేయడం ఎంత కష్టమో, ఆ వ్యాక్సిన్‌ను కోట్ల మంది ప్రజలకు చేరవేయడం అంత కంటే కష్టమైన పని అని విశ్లేషకులు అంచనా వేస్తున్నా రు. ప్రస్తుత పరిస్థితులలో గ్లోబల్‌ గా ఫ్రైట్‌ (రవాణా) ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ పనులు ఆగిపోయాయి. పోర్టులు , కార్గో ఎయిర్‌ క్రాఫ్ట్‌‌ల కెపాసిటీ తగ్గిపోయింది. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి వచ్చి నా ఈ మెడిసిన్‌ ను రవాణా చేయడానికి సిద్ధంగా లేమని సరుకు రవాణా కంపెనీలు చెబుతుండడం గమనార్హం. వీటికి తోడు వివిధ దేశాలు ఎకానమీ, పొలిటికల్‌ సమస్యలతో సతమతవుతున్నాయి. లాక్‌ డౌన్‌ తో వివిధ దేశాల మధ్య గూడ్సు రవాణా నిలిచిపోయింది.

పాత గూడ్సు డెలివరీ చేయడానికే ప్రస్తుతం ఉన్న ఫ్రైట్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ సరిపోతుందని ఈ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌవ్స్‌‌లను రవాణా చేసేట్టు వ్యాక్సిన్‌ లను రవాణా చేయడం కుదరదని అంటున్నాయి. వీటికి తోడు రవాణా సెక్టా ర్లో పేపర్‌ వర్క్‌‌, ఓల్డ్‌ టెక్నాలజీ వంటివి మరింత అడ్డంకులుగా ఉన్నా యని చెబుతున్నాయి. ప్రపంచ నలుమూలలకు కరోనా వ్యాక్సిన్‌ ను వేగంగా చేర్చడానికి ఈ సమస్యలను పరిష్కరించడం కీలకం. ఫార్మా కంపెనీలు కూడా తమ కెపాసిటీని పెంచాల్సి ఉంటుంది. పీపీఈ లను సప్లయ్‌ చేసేంత సులువుగా వ్యాక్సిన్‌ ను సప్లయ్‌ చేయడం కుదరదని సరుకు రవాణా కంపెనీ ఫ్లెక్స్‌‌పోర్ట్‌‌  పేర్కొంది.

రవాణా కంటైనర్లు లేదా వెహికల్స్‌‌ కొన్ని రోజులు నిలిచిపోయినా పెద్దగా నష్టం ఉండదని, అదే వ్యాక్సిన్‌ అయితే ఎందుకూ పనికిరాకుం డా పోతుందని చెప్పింది. ఒక బోయిం గ్‌ 777 కార్గో ఎయిర్‌ క్రాఫ్ట్ ద్వారా 10 లక్షల ఇండివిడ్యువల్‌ వ్యాక్సిన్ డోస్‌ లను రవాణా చేయడానికి వీలుంటుం దని ఫ్రైట్‌ క్యారియర్‌ కంపెనీ స్కై కార్గో పేర్కొం ది. దీని ప్రకారం ప్రపంచంలోని సగం మంది జనాభాకు సరిపడినంత వ్యాక్సిన్‌ ను రవాణా చేయాలంటే 8,000 కార్గో విమానాలు అవసరమవుతాయని తెలిపింది.

రిఫ్రిజిరేషన్‌‌ కూడా సమస్యే..

మెడికల్‌ ప్రొడక్ట్‌‌లను రవాణా చేసేటప్పుడు రిఫ్రిజిరేషన్‌ కూడా సమస్యగానే ఉంటుం ది. మొత్తం రవాణా టైమ్‌ లో వ్యాక్సిన్‌ ప్రొటెక్షన్‌ కోసం 2–8 డిగ్రీల టెంపరేచర్‌ మధ్య మెయిం టైన్ చేయాల్సి వస్తుంది. కొన్నింటికి మైనస్‌ 8 0 డిగ్రీల వరకు కూడా టెం పరేచర్‌ను తగ్గించాల్సి వస్తుంది. ఏమాత్రం టెం పరేచర్‌ పెరిగినా ఈ మెడిసిన్స్‌‌ పనికిరాకుం డా పోతాయి. మరోవైపు రవాణా సదుపాయాలు లేని ప్రాంతాలకు ఈ మెడిసిన్స్‌‌ను చేర్చడం కూడా సమస్యే . మెడిసిన్స్‌‌ను రవాణా చేసే వారు ఇంకా వీటిపై దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. డ్రగ్స్‌‌ను తయారు చేసే కంపెనీల నుంచి వీరు సిగ్నల్స్‌‌ కోసం ఎదురుచూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్‌ మాన్యుఫాక్చరింగ్ కోసం రెడీ అవుతున్న చాలా కంపెనీలకు వాటి రవాణాకు ఏం కావాలో కూడా క్లారిటీ లేదని ఫ్లెక్స్‌‌ పోర్ట్‌‌ పేర్కొంది. ప్రజల అంచనాలు ఎక్కువగా ఉండడంతో వ్యాక్సిన్‌ కంపెనీలపై ఒత్తిడి ఉందని చెప్పాయి. గ్లోబల్‌ ఎకానమీ తిరిగి గాడిలో పడాలంటే దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ తొందరగా అందాల్సి ఉంది. కానీ ఎంత లేదనుకున్న కనీసం 2021 వరకు ఈ వ్యాక్సిన్‌ అందరికీ అందే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా వ్యాక్సిన్‌ రెడీ అవ్వడం కష్టమైనదిగా ప్రజలు భావిస్తారు. కానీ దీనికన్నా కష్టమైన పని డిస్ట్రిబ్యూషన్‌ అని ఫార్మా కంపెనీ మెర్క్‌‌ అండ్‌ కో పేర్కొంది.

Latest Updates