వ్యాలెట్లకు RBI డెడ్ లైన్ : రేపటి వరకే గడువు

mobile-walletపేటీఎం, మొబిక్విక్, ఓలా మనీ, అమెజాన్‌ పే తరహా ప్రీపెయిడ్‌ వ్యాలెట్లు తమ కస్టమర్లకు సంబంధించిన KYC వివరాలు ధ్రువీకరించేందుకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28గానే ఉంటుందని, దీన్ని పొడిగించేది లేదని స్పష్టం చేసింది RBI. కేవైసీ మార్గదర్శకాల అమలుకు కావాల్సినంత వ్యవధి ఇచ్చామని.. గడువులోపు కేవైసీకి సంబంధించిన వివరాలు సమర్పించని కస్టమర్లు ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు అధికారులు. వ్యాలెట్లలో ఉన్న బ్యాలన్స్‌ను సరుకుల కొనుగోలుకు, సేవలకు వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

వ్యాలెట్‌ తిరిగి రీచార్జ్‌ చేసుకోవాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలని చెప్పారు RBI డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో . లావాదేవీల భద్రతా, కస్టమర్ల రక్షణ కోసమే ఈ నిబంధన అమలు చేస్తున్నామని తెలిపిన కనుంగో..  బ్యాంకులు ప్రమోట్‌ చేసిన 50 వ్యాలెట్లతోపాటు నాన్‌ బ్యాంకింగ్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్లు 55 వరకు ప్రస్తుతం మనదేశంలో ఉన్నాయన్నారు. కేవైసీ నిబంధనలు అమలు చేసేందుకు ఈ సంస్థలకు గతేడాది డిసెంబర్‌ 31 వరకు తొలుత గడువు ఇచ్చామని..తర్వాత దీన్ని ఫిబ్రవరి 28కి పొడిగించామని తెలిపారు. నిజానికి ఈ నిబంధన వ్యాలెట్‌ సంస్థలను కలవరపరిచేదేనని.. ఎందుకంటే 90 శాతం కస్టమర్లు ఫోన్‌ నంబర్, ఈ మెయిల్‌ వివరాలతోనే వీటి సేవలను వినియోగించుకుంటున్నారన్నారు.

Posted in Uncategorized

Latest Updates