శంషాబాద్ లో పేలిన ఫోన్ : రింగ్ అయిన వెంటనే పొగలు.. ఆ తర్వాత పేలుడు

RED MI

ఫోన్.. చేతిలో బాంబ్ అయ్యిందా.. ఎప్పుడు పేలుతుందో తెలియదా.. అక్కడక్కడ జరుగుతున్న ఈ ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ముంబైలో ఓ వ్యక్తి జేబులోనే పవర్ బ్యాంక్ పేలింది. ఆ తర్వాత బెంగళూరు, విశాఖపట్నంలో ఫోన్లు పేలిన వార్తలు విన్నాం. ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ లో ఇలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. కళ్ల ముందు ఫోన్ పేలిపోవటంతో షాక్ అయ్యాడు ఆ యువకుడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చిట్టిబాబు.. శంషాబాద్ యువకుడు. జూన్ 13వ తేదీ బుధవారం మధ్యాహ్నం కూరగాయల మార్కెట్ లో ఉన్నాడు. ఈ సమయంలోనే ఫోన్ వచ్చింది. ఫోన్ తీసేలోపే పొగలు వచ్చాయి. దీంతో భయపడిన చిట్టిబాబు.. ఫోన్ ను కింద పడేశాడు. ఆ వెంటనే క్షణాల్లో ఆ ఫోన్ పేలిపోయింది. ఓ ఫోన్ కళ్ల ముందు పేలిపోవటంతో కూరగాయల మార్కెట్ లోని అందరూ షాక్ అయ్యారు. ఎవరికి వారు.. వాళ్ల ఫోన్లను చెక్ చేసుకోవటం కనిపించింది.

ఇటీవలే చిట్టిబాబు చైనాకి చెందిన రెడ్ మీ 4A ఫోన్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఫోన్ పేలటంతో.. కంపెనీకి కంప్లయింట్ చేశాడు. పేలిన ఫోన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Posted in Uncategorized

Latest Updates